‘దిగ్బల రాజయోగం’తో 6 రాశుల దశ తిరుగుతోంది

జ్యోతిషశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన యోగాల్లో 'దిగ్బల రాజయోగం' ఒకటి. గ్రహాలు తమకు అనుకూలమైన దిశల్లో బలాన్ని పుంజుకున్నప్పుడు ఈ అరుదైన యోగం సిద్ధిస్తుంది. జాతక చక్రంలో సొంత రాశిలో బుధుడు లేదా గురువు, 4వ ఇంట శుక్రుడు లేదా చంద్రుడు, 7వ ఇంట శని, అలాగే 10వ ఇంట కుజుడు లేదా రవి సంచరిస్తున్నప్పుడు ఈ రాజయోగం ఏర్పడుతుంది.

ఈ యోగం నడుస్తున్న కాలంలో జాతకులకు అంచనాలకు మించిన అద్భుత విజయాలు, ఊహించని ధనలాభం, వృత్తి-ఉద్యోగాల్లో తిరుగులేని పురోగతి లభిస్తాయి. ప్రస్తుతం గ్రహాల అనుకూల సంచారం వల్ల మొత్తం 6 రాశుల వారికి ఈ 'దిగ్బల రాజయోగం' అద్భుతమైన పురోగతిని ప్రసాదిస్తోంది.

Horoscope The fortunes of 6 zodiac signs are turning around with the Digbala Rajayoga

వృషభ రాశి

వృషభ రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెలాఖరు వరకు దిగ్బల రాజయోగం కొనసాగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడంతో పాటు సామాజికంగా మీ గౌరవ మర్యాదలు, స్థాయి పెరుగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం రోజురోజుకూ వృద్ధి చెందుతుంది.
వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పట్టి, ఎంతో బిజీగా ఉంటారు. కష్టాల్లో ఉన్న బంధుమిత్రులకు అండగా నిలుస్తారు.

మిథున రాశి

మిథున రాశిలో గురుడి సంచార ప్రభావంతో జూన్ మొదటి వారం వరకు ఈ రాశి వారికి సువర్ణావకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆస్తి వివాదాలు, సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలించి విలువైన ఆస్తి లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగంలో ఉన్నత హోదాతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి 10వ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఈ రాజయోగం సిద్ధించింది. జూన్ 20వ తేదీ లోపు వీరి జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతాల పెంపుతో పాటు వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న వారికి విదేశీ సంబంధాలు కుదురుతాయి. వివిధ మార్గాల ద్వారా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగి, వ్యాపారంలో రాబడి వృద్ధి చెందుతుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి 10వ ఇంట సూర్యుడి సంచారం వల్ల అత్యంత శక్తివంతమైన దిగ్బల యోగం కలిగింది. జూన్ 15 లోపు వీరు అద్భుతమైన విజయాలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలంలో విజయం ఖాయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా మరింత మంచి కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. సమాజంలో ఉన్నత వర్గాల వారితో, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఊహించని స్థాయిలో ధనలాభం ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తొలగిపోవడమే కాకుండా, ఉన్నత స్థాయి వ్యక్తితో వివాహం నిశ్చయమవుతుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి 7వ స్థానంలో శని దేవుడి సంచారం వల్ల ఈ ఏడాదంతా తిరుగులేని దిగ్బల యోగం నడుస్తుంది. మీ జీవితం నల్లేరు మీద బండిలా సునాయాసంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో మీ ప్రత్యర్థులు లేదా పోటీదారుల కంటే మీరు ఎంతో ముందంజలో ఉంటారు. నిరుద్యోగులు కలలో కూడా ఊహించని స్థాయి కలిగిన మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. రాజకీయ, ఉన్నత వర్గాల సాన్నిహిత్యంతో సామాజిక హోదా పెరగడమే కాకుండా, ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.

మీన రాశి

మీన రాశి వారికి 4వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల లభించిన ఈ యోగం మరో 20 రోజుల పాటు అద్భుతంగా పనిచేస్తుంది. ఉద్యోగ, వృత్తి జీవితాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభించి, మీ ప్రాముఖ్యత, గౌరవం బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు అంతర్జాతీయ స్థాయిలో విదేశాల నుంచి అద్భుతమైన ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోయి, ఆర్థికంగా ఎటువంటి లోటూ లేకుండా జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+