భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న పోలీసు
ఏలూరు: భార్యను కాల్చి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ కథ ఇది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రేంజి డీఐజీ కార్యాలయంలో ఎ ఆర్ కానిస్టేబుల్ గా పనిచేసే నాగభూషణం నిన్న రాత్రి కొత్త సంవత్సరం కొన్ని గంటల్లో వస్తోందనగా ఈ ఘాతుకానికి పాల్పడి, పిల్లల శోకానికి కారణమయ్యాడు.
నాగభూషణం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన వెంటనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. భార్య మీద అనుమానమే దీనికి కారణమని తెలుస్తోంది. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి చేసిన దారుణం గురించి పిల్లలే పోలీసులకు చెప్పారు.












Click it and Unblock the Notifications