తెలంగాణేతర విద్యాసంస్థలపై నిషేధం: కెసిఆర్
వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలోని తెలంగాణేతర విద్యా సంస్థలను నిషేధిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చెప్పారు. వరంగల్లులో జరిగిని విద్యార్థుల సదస్సులో ఆయన సోమవారంనాడు ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయశక్తిగా మార్చాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రజలను తెలంగాణ ఉద్యమానికి మానసికంగా సంసిద్ధం చేయాలని ఆయన విద్యార్థులను కోరారు.
తెలంగాణ ఉద్యమం విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి దురాలోచన సాగలేదని ఆయన అన్నారు. తెలంగాణవాళ్లు పిచ్చోళ్లని ముఖ్యమంత్రి అనుకున్నారని, తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయగానే బస్సులు దగ్ధం చేయడం వంటి హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతారని, దాంతో అందర్నీ జైళ్లలోకి నెట్టేద్దామని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ అది జరగలేదని ఆయన అన్నారు. కరీంనగర్ లోక్ సభ ఉపఎన్నిక ద్వారా ముఖ్యమంత్రికి బుద్ది చెప్పామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
