తెలంగాణపై నిర్ణయమే చేయలేదు: పొన్నాల
హైదరాబాద్: తెలంగాణపై తమ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం ప్రజల మనోభావాలను విస్మరించబోదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం ఇప్పటి వరకు ఒక నిర్ణయాన్ని ప్రకటించలేదని, రెండో ఎస్సార్సీ వేసే విషయాన్ని పరిశీలిస్తోందని మాత్రమే వీరప్ప మొయిలీ చెప్పారని ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తమ పార్టీ నాయకత్వం తెలంగాణపై నిర్ణయం ప్రకటించే వరకు తానేమీ చెప్పలేనని ఆయన అన్నారు. ఊహాగానాలపై మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.
అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే తమ పార్టీ నాయకత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే పార్టీ నష్టపోతుందనే విషయాన్ని తాము పార్టీ అధిష్ఠానవర్గానికి తెలియజేశామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా తమ పార్టీ నాయకత్వం వ్యవహరించబోదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications