మధుయాష్కీపై జిఎస్ రావు మండిపాటు
హైదరాబాద్: తెలంగాణపై పార్టీ అధిష్ఠానవర్గాన్ని ఆంధ్ర, రాయలసీమ నేతలు ప్రభావితం చేస్తున్నారని పార్టీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ ప్రకటనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు మండిపడ్డారు. పార్టీ అధిష్ఠానవర్గం వద్ద అన్ని ప్రాంతాల నాయకులు సమానులేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మధుయాష్కీ ఆ విధమైన ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలనే విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో చెప్పామని, పార్టీ దానికే కట్టుబడి ఉంటుందని, పార్టీ నాయకులందరూ దానికే కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని తెలంగాణ విషయంలో పార్టీ నెరవేరుస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications