సోనియాను తిడితే సహించం: మధుయాష్కీ
హైదరాబాద్: తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తిడితే సహించబోమని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ హెచ్చరించారు. వివిధ ప్రైవేట్ తెలుగు టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలంగాణపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కాంగ్రెసుకు మనుగడ ఉంటుందని ఆయన అన్నారు. తమ పార్టీవారు ఇంటలిజెన్స్ నివేదికను కూడా మార్చేశారని ఆయన విమర్శించారు.
ఆంధ్ర, రాయలసీమ నాయకులు పార్టీ అధిష్ఠానవర్గాన్ని ప్రభావితం చేస్తున్నారని ఆయన అన్నారు. కొందరు తెలంగాణ మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. రెండో ఎస్సార్సీని ప్రజలు నమ్మరని, ఆ విషయం చెప్పడానికి తాము త్వరలోని సోనియాను కలుస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై సిపియం డబుల్ గేమ్ ఆడుతోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications