రేపు సిరిసిల్లలో తెరవే సభలు

కరీంనగర్: తెలంగాణ రచయితల వేదిక (తెరవే) నాల్గవ రాష్ట్ర మహాసభలు రేపు (శనివారం) కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో జరుగుతాయి. ప్రారంభ సమావేశానికి నాగపూర్ విశ్వవిద్యాలయం అంబేద్కర్ ఆలోచనా విభాగం అధిపతి డాక్టర్ ప్రదీప్ అగ్లావే ముఖ్య అతిథిగా హాజరవుతారని తెరవే అధ్యక్షుడు జూకంటి జగన్నాథం చెప్పారు. ప్రారంభ సదస్సులో తొలితరం కథారచయిత గూడూరి సీతారాం, ప్రముఖ విప్లవ కవి వరవరరావు, వార్త దినపత్రిక సంపాదకుడు టంకశాల అశోక్, ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె. శ్రీనివాస్, ప్రముఖ కవి జింబో ఆత్మీయ అతిథులుగా హాజరవుతారు. ప్రముఖ దర్శకుడు బి. నరసింగరావు, సుద్దాల అశోక్ తేజ కూడా సదస్సులో పాల్గొంటారు. గోరటి ఎంకన్న, అందెశ్రీ, బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, సుద్దాల భారతి, అంతడుపుల రమాదేవి వంటి గాయకులకు సన్మానాలు జరుగుతాయి.

ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, కత్తి పద్మారావు, సతీష్ చందర్ సంఘీభావ ప్రకటనలు చేస్తారు. తెలంగాణ చరిత్రపై డా. రాజారెడ్డి, తెలంగాణ ముస్లిం కవిత్వంపై షాజహానా, తెలంగాణ భాషపై ఆచార్య రవ్వా శ్రీహరి, తెలంగాణ జానపదంపై డాక్టర్ కె. ముత్యం మాట్లాడుతారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు, గుడిహాళం రఘునాథం, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డా. జైశెట్టి రమణయ్య, డా. అమ్మంగి వేణుగోపాల్ తదితరులు ఆత్మీయ, విశిష్ట అతిథులుగా హాజరవుతారు. డా. నందిని సిధారెడ్డి సోయి ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు. ఆచార్య బన్న అయిలయ్య, డా. నాళేశ్వరం శంకరం, డా. దామెర రాములు ఆయా సదస్సులకు అధ్యక్షత వహిస్తారు. సదస్సు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+