రెండో ఎస్సార్సీపై తెరాస రాస్తారోకోలు
హైదరాబాద్: రెండో ఎస్సార్సీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలంగాణ అంతటా శుక్రవారం ధర్నాలు, రైల్ రోకోలు నిర్వహించింది. ఈ సందర్భంగా పోలీసులు తెరాస కార్యకర్తలను అరెస్టు చేశారు. హైదరాబాదులోని ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద తెరాస కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డితో పాటు తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ముషిరాబాద్ పోలీసు స్టేషనుకు తరలించారు. వారు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
వరంగల్ జిల్లా కాజీపేటలో తెరాస కార్యకర్తలు ఎపి ఎక్సుప్రెస్సును అడ్డుకున్నారు. దాన్ని కొద్దిసేపు నిలిపేశారు. ఈ సందర్భంగా పోలీసులు తెరాస కార్యకర్తలను అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా రామగుండంలో కూడా తెరాస కార్యకర్తలు ఎపి ఎక్సుప్రెస్సును ఆపేశారు. తెలంగాణలోని పలు చోట్ల తెరాస కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications