కాకాకు కోపమెందుకంటే..: రాఘవులు
హైదరాబాద్: రాష్ట్రపతికి పదవికి అడ్డుపడ్డామనే అక్కసుతో కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి తమపై బురద చల్లుతున్నారని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. తెలంగాణకు వైయస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, సీతారాం ఏచూరి, రాఘవులు వ్యతిరేకమని కాకా చేసిన వ్యాఖ్యను రాఘవులు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. తాము దుష్టచతుష్టయమైతే, వారేమిటి, వారి నాయకురాలు సోనియా గాంధీ ఏమిటని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఒక రొచ్చుగుంట అని, ఆ రొచ్చుగుంటలో రాళ్లు విసురుతూ తమపై కాంగ్రెస్ వారు బురద చల్లుతున్నారని ఆయన అన్నారు. మూడేళ్ల నుంచి వారు ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. మూడేళ్లుగా కాకా సోనియాను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అడిగారు. వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తమపై బురద చల్లుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications