కెసిఆర్ వి మత్తు దిగని మాటలు: నాగేందర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ చిరంజీవి పార్టీ పెడితే అందులో తాను చేరుతానని చెప్పిన తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్యపై కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ దుమ్మెత్తిపోశారు. హరిరామజోగయ్య ఎక్కడి నుంచి పోటీ చేసినా డిపాజిట్ దక్కదని, ఒకవేళ అది జరగకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. హరిరామజోగయ్య ఊసరవెళ్లి అని ఆయన అన్నారు.
హరిరామజోగయ్య తమ పార్లమెంటు సభ్యుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందని ఆయన అన్నారు. హరిరామజోగయ్యను సస్పెండ్ చేయాలని ఆయన పార్టీ అధిష్ఠానవర్గాన్ని కోరారు. హరిరామజోగయ్య రంగులు మారుస్తుంటారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మత్తులోంచి దిగకుండా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ అడ్రస్ లేకుండా పోతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications