తెలంగాణ కాంగ్రెస్ నేతలు చవటలే: కెసీఅర్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నాయకులను చవటలుగా అభివర్ణిస్తూనే ఉంటామని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేసి పోరాడాలని ఆయన సూచించారు.
అవసరమైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను ఎన్నికల్లో ఓడిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ భూములు అమ్మి, ఢిల్లీకి డబ్బు సంచులు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజశేఖరరెడ్డి తన ఫ్యాక్షనిస్టు స్వభావాన్ని విడుచుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications