హైదరాబాద్: చిరంజీవి ఉగాది నాడు పార్టీని ప్రకటించనున్నారని, ఆయన పార్టీ పేరు "స్వయంకృషి" అని, ఎన్నికల చిహ్నం "నేత్రం" అని నిన్న ఒక టీవీ చానల్ ప్రసారం చేసిన వార్త అవాస్తవమని చిరంజీవి తమ్ముడు నాగబాబు ఒక ప్రకటనలో ఖండీంచారు. ఆయన చిరంజీవి ఇంటి నెంబర్ నుంచి ఈ పత్రికా ప్రకటనను ఫ్యాక్స్ చేశారు.
ఇటువంటి ఊహాగానాలను నమ్మవద్దని నాగబాబు చిరంజీవి అభిమానులను పత్రికా ముఖంగా కోరారు. ఈ విషయంలో చిరంజీవి గారు క్షుణ్ణంగా ఆలోచించి తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని ఆయన అన్నారు.