తెలంగాణ రాష్ట్ర సమితి నిరాహార దీక్ష
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ సాధన దిశగా సాగిస్తున్న కృషిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి గురువారం లక్ష మందితో సామూహిక నిరాహార దీక్ష నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఈ దీక్ష ప్రారంభమైంది.
అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావు తెలంగాణ అమర వీరుల స్ధూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పార్కు వద్ద నిరసన కార్యక్రమం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంత కర్త ప్రొఫేసర్ జయశంకర్ మొదట బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ ఎలా వస్తుందో ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications