రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. లారీ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు.
మృతులంతా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట రామవరం గ్రామానికి చెందినవారు. వీరంతా కూలీలు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు కూలీ పనుల కోసం వెళ్తుండగా వారు మృత్యువాత పడ్డారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications