అభివృద్ధి అర్థం వేరే: ఉప్పునూతల
హైదరాబాద్: అభివృద్ధి అంటే తమ అభిప్రాయం వేరుగా ఉందని, ఈ విషయాన్ని తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్తామని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. అభివృద్ధి అంటే తమ విశ్లేషణలు, అంచనాలు వేరుగా ఉన్నాయని, తెలంగాణకు ఎలా అన్యాయం జరుగుతోందో సోనియాకు వివరిస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సోనియా తమను పిలిచినప్పుడు అన్ని విషయాలు చెప్తామని ఆయన అన్నారు. పిలువకుండా ఎలా వెళ్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్న వేశారు. తమను సోనియా తప్పకుండా పిలుస్తారని ఆయన అన్నారు. పార్టీ లోపల అన్ని తేల్చుకుంటామని, తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, తెలంగాణపై తమ అభిప్రాయాలు తాము చెప్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications