ఎర్రబెల్లిపై సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావుపై సస్పెన్షన్ ను స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి గురువారంనాడు ఎత్తివేశారు. దయాకర్ రావును శుక్రవారం వరకు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఒక రోజు ముందుగా ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేశారు.
దేవేందర్ గౌడ్ కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టడంతో దయాకర్ రావుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయాకర్ రావును శుక్రవారం వరకు సస్పెండ్ చేశారు. దయాకర్ రావుపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని తెలుగుదేశం సభ్యులు బుధవారంనాడు కోరారు. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే సస్పెన్షన్ ను ఎత్తివేయడానికి తాము సిద్ధమేనని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య చెప్పారు. అందుకు తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరాకరించారు.












Click it and Unblock the Notifications