మహిళ హత్య: యువకుడి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని ఎల్.బి. నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసే దిలీప్ అనే యువకుడు తన గదికి ఒక మహిళను తీసుకొచ్చాడు. ఇరువురి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దాంతో దిలీప్ గొంతు నులిమి మహిళను హత్య చేశాడు.
దిలీప్ ను పోలీసులు అరెస్టు చేసి, కేసును దర్యాప్తు చేస్తున్నారు. మహిళను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఆమె ఎవరన్నది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications