రామచరణ్ సినిమా ప్రారంభం

హైదరాబాద్: చిరంజీవి తనయుడు రామచరణ్ రెండో సినిమా ఆదివారంనాడు ప్రారంభమైంది. ముహూర్తం షాట్ కు చిరంజీవి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మాణమవుతోంది. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. రామచరణ్ సరసన చందమామ సినిమా ఫేమ్ కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రం ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాత రామానాయుడితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

రాజమౌళి చెప్పిన కథ తనకు, చిరంజీవికి, రామచరణ్ కు బాగా నచ్చిందని, వెంటనే ఒకె చెప్పామని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. సినిమా గురించి పలు ఊహాగానాలు మీడియాలో వచ్చాయని, అవన్నీ నిజం కాదని రాజమౌళి అన్నారు. సినిమా పేరు ఇంకా ఖరారు కాలేదని ఆయన చెప్పారు. శ్రీదేవి నటిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగిందని, సినిమాలో అటువంటి పాత్రే లేదని ఆయన చెప్పారు. ఇది ప్రధానంగా ప్రేమ కథ అని, అయితే యాక్షన్ కూడా బోలెడు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నెల 15వ తేదీ తర్వాత నెల రోజుల పాటు రాజస్థాన్ లో షూటింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. తన సత్తాను ప్రదర్శించడానికి అవకాశం ఉన్న సినిమా అని, చాలా శారీరక శ్రమ ఇమిడి ఉందని, అందుకు తాను సిద్ధమవుతున్నానని రామచరణ్ అన్నాడు. తనకు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టమని, తన కలలు నిజమయ్యాయని కాజల్ అంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+