బాబా వ్యాఖ్యలు దురదృష్టకరం: సీనియర్లు

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంపై సత్యసాయిబాబా వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్లు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు శుక్రవారంనాడు నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో కోలాహలం చోటు చేసుకుంది. తమ ప్రాంతాలను తామే పాలించుకుంటామని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పార్టీ అధిష్ఠానవర్గం గౌరవించక తప్పదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండు లక్షల మందితో భువనగిరి సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాలతో రాజకీయాలు అనూహ్యంగా మారాయని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెరాస రాజీనామాల వల్ల పార్టీ ప్రభావంపై ఎల్లుండి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీకి వివరిస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 24వ తేదీన భువనగిరిలో జరిగే సభకు తెలంగాణకు చెందిన మంత్రులను, శాసనసభ్యులను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. యాదగిరిగుట్ట సమాలోచనలకు జి. వెంకటస్వామి, ఎం. సత్యనారాయణ రావు, అమోస్ రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+