పుష్కర ప్రాజెక్టును ప్రారంభించిన సోనియా
రాజమండ్రి: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్ సోనియా గాంధీ పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లాలోని పురుషోత్తమ పట్నం వద్ద ఆమె ఈ ప్రాజెక్టును శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పళ్లంరాజు, పిసిసి తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు, పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీకి వివరించారు.
అంతకు ముందు ఆమె శుక్రవారం ఉదయం విమానంలో రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రిలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి నేరుగా పుష్కర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు హెలికాప్టర్ లో పురుషోత్తమ పట్నం వెళ్లారు. పుష్కర ఎత్తిపోతలను ప్రారంభించిన అనంతరం ఆమె జగ్గంపేటకు బయలుదేరి వెళ్లారు. ఇక్కడ ఆమె బహిరంగ సభలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications