రౌడీ షీటర్ కృష్ణంరాజు దారుణ హత్య
విశాఖపట్నం: విశాఖపట్నంలోని మధురవాడలో రౌడీ షీటర్ మందపాటి కృష్ణంరాజు దారుణ హత్యకు గురయ్యాడు. ఒక భూవివాదంలో అతను హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. కృష్ణంరాజు భూవివాదాల్లోనూ, దొంగనోట్ల కేసులోనూ నిందితుడు.
దొంగనోట్ల కేసులో బయటకు వచ్చిన కృష్ణంరాజు భూవివాదాల్లో తలదూర్చాడు. పాండురంగారావు అనే వ్యక్తితో అతను గొడవ పడ్డాడు. దీంతో పాండురంగారావు 30 మందితో మారణాయుధాలతో వచ్చి కృష్ణంరాజుపై దాడి చేశాడు. ఈ దాడిలో కృష్ణం రాజు మరణించాడు. గొడ్డళ్లు, కత్తులతో ప్రత్యర్థులు కృష్ణంరాజుపై దాడి చేశారు.












Click it and Unblock the Notifications