సభ వాయిదా ఆత్మద్రోహం: అమోస్
న్యూఢిల్లీ: తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి భువనగిరి సభను వాయిదా వేయడం ఆత్మద్రోహమని కాంగ్రెస్ తెలంగాణ వేదిక కన్వీనర్ కె.అర్. అమోస్ వ్యాఖ్యానించారు. తనకు గానీ, వేదిక చైర్మన్ అయిన వెంకటస్వామికి గానీ చెప్పకుండా పురుషోత్తమ రెడ్డి సభను వాయిదా వేశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అలా ఎందుకు చేశారో తెలియడం లేదని కాంగ్రెస్ తెలంగాణ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. భువనగిరి సభను వాయిదా వేయడం ఉద్యమానికి పెద్ద దెబ్బ అని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలు తమనుంచి ఆశిస్తున్నారని, సభ వాయిదా పడటంతో నిరుత్సాహానికి గురయ్యారని ఆయన అన్నారు. భువనగిరి సభ వాయిదాతో కాంగ్రెస్ సీనియర్లలో విభేదాలు తలెత్తాయి. సభ వాయిదా గురించి తాను వెంకటస్వామికి చెప్పానని పురుషోత్తమ రెడ్డి అంటున్నారు. తాను ద్రోహాం చేశానని అంటున్నారు కదా, తెలంగాణ కోసం అందరం రాజీనామా చేద్దాం రండని ఆయన వెంకటస్వామికి, అమోస్ కు సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications