అధికారంలో ఉన్నంతదాకా ఉచితం: వైయస్

నెల్లూరు: తాము అధికారంలో ఉన్నంత వరకు రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత విద్యుత్తును ఇస్తున్నామని, నాలుగేళ్ల పాటు అలా ఇచ్చిన తర్వాత అధికారంలో ఉన్నంత కాలం ఇవ్వగలమనే నమ్మకం కుదిరిందని ఆయన అన్నారు. నెల్లూరులో శనివారం జరిగిన కాంగ్రెసు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నామని, ఉచిత విద్యుత్తుకు 1200 కోట్ల రూపాయల భారం భరిస్తున్నామని ఆయన చెప్పారు.

మరో రెండు నెలల్లో జాతీయ సాంకేతిక సంస్థను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మంచిది కాదని ఆయన హితవు చెప్పారు. సొంత లాభం కొంత మానుకుని పరుల మేలు కొంత తలపెడుతుండడం వల్లనే కార్యకర్తలు కాంగ్రెసులో ఉండగలుగుతున్నారని, వారు ఏదో వ్యక్తిగత మేలును ఆశించి ఉండడం లేదని ఆయన అన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+