ప్రజాసంఘాల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం
హైదరాబాద్: ప్రజా సమస్యలపై ప్రజాసంఘాల ఐక్య వేదిక బుధవారం చేపట్టిన కలెక్టర్ కార్యాలయాల ముట్టడి పలు చోట్ల రక్తసిక్తంగా మారింది. పోలీసులు కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. పలువురు నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఇందులో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అస్పత్రికి తరలించారు. విశాఖపట్నంలోనూ ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు.
ఏలూరులోనూ పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కూడా ఉద్రిక్తంగా మారింది. అనంతపురం, వరంగల్, నెల్లూరు తదితర జిల్లాల్లో పరిస్థితి కూడా ఇదే. పోలీసుల లాఠీచార్జీని ప్రజాసంఘాల నాయకులు ఖండించారు.












Click it and Unblock the Notifications