రజనీ ఇంటికి పోలీసు భద్రత
చెన్నై: తమిళనాడులోని కన్నడిగుల కార్యకలాపాలకు, ఆస్తులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి చెన్నైలోని కన్నడ నటుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రజనీకాంత్, ప్రకాశ్ రాజ్, మురళి, అర్జున్ ఇళ్లతో పాటు ఇతర కన్నడ నటుల ఇళ్ల వద్ద కాపలా పెంచారు. తమిళనాడు ప్రభుత్వం హొగెనకల్ ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ స్థితిలో తమిళనాడులోని కన్నడిగుల ఆస్తులపై కూడా దాడులు జరుగుతున్నాయి.
కర్ణాటకలో గురువారంనాడు తమిళ సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లపై, తమిళ సంఘం కార్యాలయంపై, తంతి దినపత్రిక కార్యాలయంపై దాడులు జరిగాయి. చెన్నైలోని టి. నగరులో గల కన్నడ సంఘం కార్యాలయానికి పోలీసు భద్రత కల్పించారు. కన్నడ నటులు ప్రకాశ్ రాజ్, మురళి, ఆర్జున్, దివ్య నిరాహార దీక్షలో పాల్గొనకపోతే తీవ్ర చర్యలుంటాయని నడిగార్ సంఘం గురువారంనాడు హెచ్చరించింది.












Click it and Unblock the Notifications