కన్నడ పక్షాలపై రజనీకాంత్ ఆగ్రహం
చెన్నై: కర్ణాటకలో తమిళ సినిమాల నిషేధంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాకట వైఖరికి నిరసనగా తమిళ సినీ పరిశ్రమ చేపక్ మైదానంలో శుక్రవారం చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. కన్నడ రాజకీయ పక్షాల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల రాజకీయం చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన హొగెనకల్ ప్రాజెక్టు వివాదం చాలా సున్నితమైనదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుపై తలెత్తిన వివాదం జాతీయ సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నేతలతోనే సమస్య పరిష్కారం కావాల్సి ఉందని ఆయన అన్నారు. కర్ణాటకలో పుట్టి తమిళంలో సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ తమిళ సినీ పరిశ్రమ పక్కనే నిలబడ్డారు.












Click it and Unblock the Notifications