చౌకగా పప్పులు, నూనె: వైయస్

శ్రీకాకుళం: మరో రెండు నెలల్లో పేదలకు కందిపప్పు, మంచినూనె సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాకుళంలోని రేగులపాడు వద్ద ఆయన శుక్రవారంనాడు ఆఫ్ షోర్ రియర్యాయరుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన చెప్పారు. పేదల కోసం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

తెలుగుదేస ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలోనే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి జరిగింది. పేదల కోసం, రైతుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ నెల 9వ తేదీనుంచి పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని అందిస్తున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+