కుతూహలమ్మ మనస్సాక్షికి తెలుసు: టిడిపి

Chandrababu Naidu
హైదరాబాద్: శాసనసభ డిప్యూటి స్పీకర్ కుతూహలమ్మను శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్యనే విమర్శించారని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. కుతూహలమ్మను పదే పదే దళిత మహిళ అని గుర్తు చేస్తూ రోశయ్య అవమానిస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. శాసనసభలో జరిగిన సంఘటనను రోశయ్య వక్రీకరించారని ఆయన అన్నారు. జరిగిన సంఘటన వేరు, కాంగ్రెస్ అంటున్న విషయం వేరని ఆయన అన్నారు. శాసనసభలో జరిగిన సంఘటనను ఎలా వక్రీకరించారో తెలియజేయడానికి ఆయన క్లిప్పింగులను ప్రదర్శించి చూపారు.

శాసనసభ వ్యవహారాల్లో స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సభకు వచ్చి వివరణ ఇవ్వాలని తాము పట్టుబట్టామని, ఇదే విషయాన్ని ఛేంబర్ కు వెళ్లి స్పీకరుకు కూడా చెప్పామని, స్పీకర్ నోరు విప్పలేదని ఆయన చెప్పారు. స్పీకరు కె.ఆర్. సురేష్ రెడ్డి సభకు రావాలనేదే తమ ఉద్దేశం తప్ప కుతూహలమ్మపై తాము వ్యతిరేకత ప్రదర్శించలేదని, ఈ విషయాన్ని సంఘటననుంచి వేరు కాంగ్రెస్ వారు వక్రీకరించారని ఆయన అన్నారు. దళితులపై కాంగ్రెసుకు గౌరవం ఉంటే కుతూహలమ్మను స్పీకరును చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విషయాన్ని కుతూహలమ్మ విజ్ఞతకే వదిలేస్తున్నామని, ఏం జరిగిందనేది కుతూహలమ్మ మనస్సాక్షికి తెలుసునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+