పసిపాపను హత్య చేసిన మేనమామ
విశాఖపట్నం: ఇరవై రెండు రోజులు పసిపాపను మేనమామనే పొట్టన పెట్టుకున్న సంఘటన ఆదివారంనాడు విశాఖపట్నంలో జరిగింది. భరణి అనే పసిపాపను మేనమామ పొట్టన పెట్టుకున్నాడు. పాప రెండు కాళ్లు పట్టుకుని నేలకోసి కొట్టాడు. దీంతో పాప మరణించింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ సంఘటనతో కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.
ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.ఆ పసిపాపకు మేనమామనే పేరు పెట్టాడు. తన ఆస్తినంతా తన మనవరాలికే ఇస్తానని నిందితుడి తల్లి చెప్పడంతో తల్లీకొడుకుల మధ్య గొడవ ప్రారంభమైంది. కోపంలో మేనమామ కోడలి కాళ్లు పట్టుకుని పాపను నేలకేసి కొట్టాడు.












Click it and Unblock the Notifications