తిరుపతి: తెలుగుదేశం అధి నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రచార రథం ఆయన సొంత జిల్లా చిత్తూరు చంద్రగిరి దళితవాడలో బయలుదేరింది. చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైంది చంద్రగిరి నియోజకవర్గం నుంచే. చంద్రగిరి మాతమ్మ గుడి నుంచి ఆయన ప్రచారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సంస్కరణల ఫలితాలు సామాన్యులకు అందాలనే ఉద్దేశంతో యాత్రను చేపట్టినట్టు బాబు తెలిపారు. నేడంతా చిత్తూరు జిల్లాలొ సాగే ఈ యాత్ర రేపు మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది.