తొమ్మిదేళ్ల బాలుడి దారుణ హత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా వేములవాడలో తొమ్మిదేళ్ల బాలుడి దారుణ హత్య సంచలనం సృష్టించింది. శివసాయి అనే బాలుడు బుధవారం సాయంత్రం అపహరణకు గురయ్యాడు. ఆ బాలుడు గురువారం మధ్యాహ్నం వేములవాడ బైపాస్ రోడ్డులో గల కల్వర్టు కింద కనిపించింది. గొంతు కోసి బాలుడిని హత్య చేశారు. హైదరాబాదులో చదువుతున్న శివసాయి సెలవులకు ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటుండంగా శివసాయిని కిడ్నాప్ చేశారు.
కొడుకు కనిపించకపోవడంతో శివసాయి తల్లిదండ్రులు తమ బంధువుల ఇళ్లలో, మిత్రుల ఇళ్లలో దేవులాడారు. బుధవారం అర్థరాత్రి వరకు బాలుడి కోసం వెతికిన వారు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇంతలోనే అతని హత్య జరిగింది. శివసాయి తండ్రి లక్ష్మినారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ వ్యాపారంలో గొడవలే బాలుడి హత్యకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications
