ప్రేమ గొడవలో యువకుడి హత్య
మహబూబ్ నగర్: ఒక ప్రేమ గొడవ యువకుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు మండలం నాగనోలు గ్రామంలో జరిగింది. రేపు పెండ్లి కావాల్సిన యువకుడు హత్యకు గురయ్యాడు. తన ప్రియురాలిని పెండ్లి చేసుకుంటున్న యువకుడిని మరో యువకుడు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
పెండ్లి చేసుకోవాల్సిన యువకుడు గత వారం రోజులుగా కనిపించడం లేదు. అకస్మాత్తుగా అతని శవం గ్రామ సమీపంలోని గుట్టపై లభ్యమైంది. ఈ హత్య వెనక యువతి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను పెండ్లి చేసుకోబోతున్న యువకుడిని ఆ యువతి తన ప్రియుడి చేత హత్య చేయించి ఉంటుందని అనుమానిస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
