అజీజ్ రెడ్డి ఎన్ కౌంటర్ బూటకం: ఎపిసిఎల్సీ
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ అజీజ్ రెడ్డి ఎన్ కౌంటర్ బూటకమని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్సీ) ఆరోపించింది. ఎన్ కౌంటరులో పాల్గొన్న అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ జరిపించాలని ఎపిసిఎల్సీ నాయకుడు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు.
ఎదురుకాల్పులు జరిగి ఉంటే ఇరువైపులా గాయాలు ఉండాలని, కానీ అది జరగలేదని, ఏకపక్ష కాల్పుల వల్లనే అజీజ్ రెడ్డి మరణించాడని ఆయన అన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన రోజు పోలీసులు ఇరు వైపులా దారులు మూసేశారని, సంఘటన అనంతరం కూడా ఎవరినీ అటు వెళ్లనీయలేదని, తెల్లారి గానీ చూడడానికి వీలు కాలేదని ఆయన అన్నారు. అజీజ్ రెడ్డి ఛాతీపై బుల్లెట్ గాయాలున్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
