చంద్రబాబు మాయగాడు: ఉండవల్లి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాజకీయ వంచనకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. చంద్రబాబు పుస్తకం మనసులో మాటపై ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మనసులో మాట పుస్తకంలో చెప్పిన విషయాలకు ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్న విషయాలకు పొంతన లేదని ఆయన అన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు పెద్ద మాయగాడని ఆయన అన్నారు. మనసులో మాట పుస్తకంలో చెప్పిన విషయాలకు చంద్రబాబు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మనసులో మాటలోని అంశాల ప్రకారం చంద్రబాబు మాట్లాడడం లేదని ఆయన అన్నారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
