ప్రభుత్వానిదే బాధ్యత: వైయస్
గుంటూరు: గుంటూరు మార్కెట్ యార్డు ప్రమాదానికి బాధ్యత ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన మిర్చి మార్కెట్ యార్డును ఆయన ఆదివారంనాడు సందర్శించారు. అణా పైసాతో సహా రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడం అదృష్టమని ఆయన అన్నారు.
గుంటూరులో అంతర్జాతీయ మార్కెట్ యార్డును నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన మార్కెట్ యార్డు అని, అందువల్ల ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఆయన చెప్పారు. ఆయన వెంట ఆర్థిక మంత్రి కె. రోశయ్య కూడా ఉన్నారు. అయితే మార్కెట్ యార్డు వద్ద ముఖ్యమంత్రి ఎక్కువ సేపు ఉండలేదని నిరసిస్తూ రైతులు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
