అయేషా హత్య కేసు: ఉపేంద్ర అరెస్టు
విజయవాడ: విద్యార్థిని అయేషా హత్య కేసులో ప్రధాన నిందితుడిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుడు డిసెంబరులో జరిగిన అయేషా హత్య కేసును ఛేదించడంలో పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. దీంతో పలు విమర్శలను ఎదుర్కున్నారు. ఎట్టకేలకు ఈ కేసులో ఉపేంద్ర అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల సమీపంలోని చెలగల్లు గ్రామంలో పోలీసులు అతన్ని పట్టుకున్నట్లు సమాచారం.
ఉపేంద్రను రహస్యంగా ఇబ్రాహింపట్నం తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను గుర్విందర్ సింగ్ అలియాస్ లడ్డు అనుచరుడు. లడ్డు ప్రస్తుతం ఒక కేసులో విశాఖ పట్నంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయేషా హత్యకేసులో లడ్డును సహ నిందితుడిగా పోలీసులు చేరుస్తున్నారు. ఈ కేసులో లడ్డు అరెస్టుకు పోలీసులు మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటి వారంట్ దాఖలు చేశారు. తమ కూతురు హత్యలో మంత్రి కోనేరు రంగారావు మనవడి పాత్ర ఉందని అయేషా తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
