రాస్తారోకో: ఇంద్రసేనారెడ్డి అరెస్టు

Indrasena Reddy
నల్లగొండ: విజయవాడ - హైదరాబాదుల మధ్య 9వ నెంబర్ జాతీయ రహదారిని నాలుగు లేన్లకు విస్తరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై 16 చోట్ల బిజెపి కార్యకర్తలు బైఠాయించి ట్రాఫిక్ రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిసిపోయాయి.

నార్కెట్ పల్లి వద్ద రాస్తా రోకో నిర్వహించిన బిజెపి జాతీయ కార్యదర్శి ఎన్. ఇంద్రసేనారెడ్డి సహా వంద మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నల్లగొండ పోలీసు స్టేషనుకు తరలించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులను తొలగించి పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధిరించారు. బిజెపి రాస్తారోకోతో ఆర్టీసి ముందే బస్సులను నిలిపేసింది. రోడ్డు విస్తరణలో జాప్యాన్ని నిరసిస్తూ 8 గంటల రాస్తారోకో తలపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+