అయేషా హత్య కేసు ఛేదిస్తాం: జానా

అయేషా హత్య కేసులో తన కుమారుడు అమాయకుడని పోలీసుల అదుపులో ఉన్న ఉపేంద్ర తల్లి లక్ష్మీబాయి అంటోంది. ఆమె మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. తన కుమారుడిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని ఆమె విజ్ఞప్తి చేసింది. కేసు విచారణను మానవ హక్కుల కమీషన్ రేపటికి వాయిదా వేసింది. గుర్విందర్ సింగ్ అలియాస్ లడ్డూతో తన కుమారుడికి సంబంధాలు లేవని, నాలుగేళ్లుగా తన కుమారుడు లడ్డూకు దూరంగా ఉంటున్నాడని ఆమె చెప్పారు. 1998 నుంచి 2000 వరకు మాత్రమే ఉపేంద్ర లడ్డూతో ఉన్నాడని, ఆ తర్వాత దూరంగా ఉంటూ వస్తున్నాడని, అయితే ఏది జరిగినా తన కొడుకును పోలీసులు తీసికెళ్లే వారని, దీంతో అతన్ని 2004లో జగిత్యాలకు పంపానని ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications
