తిరుపతి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో హత్య
తిరుపతి: పాత నేరస్తుడు రాజు తిరుపతి ఆర్ట్స్ కళాశాల మైదానంలో హత్యకు గురయ్యాడు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో మద్యం సేవించి రాజు సోమవారం రాత్రి అక్కడే నిద్రించాడు. తెల్లారేసరికి అతను హత్యకు గురై కనిపించాడు. గొంతు కోసి అతన్ని హత్య చేశారు. రాజుపై రెండు హత్యాయత్నం కేసులతో పాటు వివిధ దౌర్జన్యం కేసులు ఉన్నాయి.
రాజు హత్య విషయంలో మరో పాత నేరస్థుడు మోహన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజుకు, మోహన్ కు మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది. ఈ విభేదాల కారణంగానే మోహన్ రాజును హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. రాజు కుటుంబ సభ్యులు మోహన్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
