రెఫరెండం కాదు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ఉప ఎన్నికలు తెలంగాణపై రెఫరెండం కాదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఏదో ఒక ప్రత్యేకాంశంపై ఎన్నికలు జరిగితే అది రెఫరెండం అవుతుందని, ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఒకే ఒక అంశం ప్రభావితం చేయడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉప ఎన్నికల్లో వివిధ అంశాలు పని చేస్తున్నాయని, ఒక అంశంపై అటా ఇటా అనే పద్ధతిలో ఎన్నికలు జరగడం లేదని ఆయన అన్నారు.

ఎన్నికల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అభ్యర్థుల బలాబలాలు తదితర అంశాలు పని చేస్తాయని ఆయన అన్నారు. కేవలం తెలంగాణ అంశంపై మాత్రమే ఈ ఎన్నికలు జరగడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 18 శాసనసభా నియోజకవర్గాలకు, నాలుగు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+