కర్ణాటకలో కాంగ్రెసే బెట్టర్: వైయస్

కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హామీల అమలు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన అన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని, యూనిట్ విద్యుత్తును 8,9 రూపాయలకు కొని 25 లక్షల మంది రైతులకు ఉచితంగా ఇస్తున్నామని ఆయన చెప్పారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తామని ఆయన అన్నారు. ప్రచారానంతరం ఆయన రేపు (బుధవారం) హైదరాబాద్ తిరిగి వెళ్తారు.












Click it and Unblock the Notifications
