కెసిఆర్ పునరాలోచించుకోవాలి: డిఎస్

{image-d srinivas_07052008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: హైదరాబాదులోని ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గంలో పోటీ విషయంలో పునరాలోచించుకోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. పెద్దమ్మగుడిలో పూజలు చేసిన అనంతరం ఆయన ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద యెత్తున పి. జనార్దన్ రెడ్డి అభిమానులు తరలి వచ్చారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి విష్ణు వెంట ఉన్నారు.

ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. డిచ్ పల్లి శాసనసభా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి మండవ వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. బావ చేత చెంప దెబ్బ కొట్టించుకున్న అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అది ఆయన సెంటిమెంటు. హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి నాయని నర్సింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెసుకు చెంపదెబ్బ కాగలవని ఆయన అన్నారు. చేర్యాల నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి నామినేషన్ వేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లాజరస్ నామినేషన్ వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+