25 లక్షలు ఇస్తామన్నారు: లడ్డూ
ఏలూరు: విద్యార్థిని అయేషా మీరా హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని గుర్విందర్ సింగ్ అలియాస్ లడ్డూ అంటున్నారు. ఏలూరు సమీపంలో జరిగిన ఒక హత్య కేసులో కోర్టులో ప్రవేశపెట్టడానికి లడ్డూను ఏలూరు సబ్ జైలుకు తరలించారు. అయేషాను హత్య చేసినట్లు ఒప్పుకుంటే పోలీసులు 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినట్లు అతను మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నాడు. ఆయేషా ఎవరో కూడా తనకు తెలియదని అతను చెప్పాడు.
అయేషా హత్య కేసులో తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని అతను ఆరోపించాడు. పోలీసులు తనను తన కుటుంబ సభ్యులతో కూడా కలవనీయడం లేదని అతను చెప్పాడు. అయేషా హత్య కేసులో పోలీసులు లడ్డు అనుచరుడు ఉపేంద్ర సింగ్ ను కరీంనగర్ జిల్లా సమీపంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లడ్డూను సహ నిందితుడిగా చేర్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లడ్డూ అరెస్టుకు కోర్టులో పిటి వారంట్ పిటిషన్ కూడా వేశారు. లడ్డూను రాజమండ్రి జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications