హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయం ఖాయమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి అన్నారు. కర్ణాటక రెండో దశ ప్రచారానికి వెళుతూ ఆయన హైదరాబాద్ విమానాశ్రయంలో ఆగారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ ఎలా మట్టి కరిచిందో కర్ణాటకలోనూ అదే జరుగుతుందని ఆయన అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా గుజరాత్ లో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు.