ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్న బీజింగ్ ఒలింపిక్ జ్యోతి
బీజింగ్ : బీజింగ్ ఒలింపిక్ జ్యోతి గురువారం ఉదయం ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ ఎవరెస్ట్ శిఖరంపైకి చైనా జాతీయ పతాకంతో పర్వతారోహకులు ఈ జ్యోతిని తీసుకెళ్లి వేడుక నిర్వహించారు.
ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8844 మీటర్లు. మొత్తం 19 మంది సభ్యుల బృందం జ్యోతిని ఎవరెస్ట్‌పైకి తీసుకెళ్లే కృత్యం నిర్వహించింది. ఇందులో ఏడుగురు పర్వతం కింద భాగంలోనే ఉండిపోగా మిగిలినవారు పైకి వెళ్లారని చైనా అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications