భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. తాడేపల్లి గూడెం నుంచి భీమవరానికి దినపత్రికలు తీసుకు వస్తున్న ట్రక్ ఆటో గరగపర్రు వద్ద రోడ్డు పక్కనే నిద్రిస్తున్న వారి పైకి దూసుకు పోయింది.
దీనితో చింతా కృష్ణ, మహాలక్ష్మి, పిల్లా శ్యామ్ లు అక్కడికక్కడే మరణించగా తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరంతా కూలీలుగా దుకాణాలలో పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications