అయేషా కేసులో కోర్టుకు లడ్డూ
విజయవాడ: విద్యార్థిని అయేషా హత్య కేసులో గుర్విందర్ సింగ్ అలియాస్ లడ్డూను పోలీసులు శుక్రవారం విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. అయేషా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన లడ్డూను అరెస్టుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. ఈ కేసులో లడ్డూను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో లడ్డూకు కోర్టు ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ నుంచి లడ్డూను పోలీసులు రాజమండ్రికి తరలించారు. అయేషా హత్య కేసులో ఇటీవల పోలీసులు కరీంనగర్ జిల్లాలో ఉపేంద్ర సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతన్ని వదిలిపెట్టారు. అయితే అయేషా హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని లడ్డూ అంటున్నాడు. నేరాన్ని అంగీకరిస్తే 25 లక్షల రూపాయలు ఇస్తామని పోలీసులు ప్రలోభపెడుతున్నట్లు కూడా అతను ఆరోపిస్తున్నాడు.












Click it and Unblock the Notifications
