తెలంగాణకు వ్యతిరేకం కాదు: బాబు

Chandrababu Naidu
ఆదిలాబాద్: తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు మీ కోసం యాత్ర రెండో రోజు సోమవారం కూడా ఆదిలాబాదులో కొనసాగింది. తెలంగాణకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి 610 జీవోను విడుదల చేసింది తామేనని, దాని అమలుకు గిర్ గ్లానీ కమీషన్ వేసింది కూడా తామేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిలకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు.

ప్రజలకు నీళ్లు కూడా లభించని అభివృద్ది రాష్ట్రంలో జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆదిలాబాదు జిల్లాలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలకు కొమురం భీం పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశాడు. గిరిజనుల సమస్యల అధ్యయనానికి గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంట ఆదిలాబాద్ తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి ఎస్ వేణుగోపాలాచారి కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+