కెసిఆర్ పై శ్రీనివాస్ మండిపాటు
{image-d srinivas_12052008.jpg telugu.oneindia.com}హైదరాబాద్: హైదరాబాదులోని ఖైరతాబాదు శాసనసభా నియోజకవర్గంలో దివంగత శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిపై పోటీకి దిగడంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై మండిపడ్డారు. పిజెఆర్ వారసుడిపై పోటీ పెడతారా అని ఆయన కెసిఆర్ ను సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. తెలంగాణ కెసిఆర్ సొత్తు కాదని, తెలంగాణపై పోరాటం చేసిన నాయకుడు పి. జనార్దన్ రెడ్డేనని ఆయన అన్నారు.
తెలంగాణ సమస్యలపై జనార్దన్ రెడ్డి చివరి వరకు పోరాడారని, ఖైరతాబాదులో తెరాస పోటీపై ప్రజలే తీర్పునిస్తారని ఆయన అన్నారు. తమ పార్టీవారిని ద్రోహులని కెసిఆర్ అనడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పునరంకిత సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం నాయకుడు నేరెళ్ల ఆంజనేయులు కాంగ్రెసులో చేరే విషయం తనతో చర్చించలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
