24న వైయస్ ఇల్లు ముట్టడి
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోతే ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నాయకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ కార్యక్రమం తర్వాతనే తమ రాజకీయ విధానాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను ఆయన సోమవారంనాడు పరిశీలించారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఉషా మెహ్రా కమీషన్ నివేదిక వర్గీకరణకు అనుకూలంగా వచ్చిందని తెలిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి ఎందుకు ఒత్తిడి తేవడం లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
